కొత్త లుక్ తో వకీల్ సాబ్ పోస్టర్

దాదాపుగా 3 సంవత్సరాల విరామం తర్వాత  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్   ‘వకీల్ సాబ్’ సినిమాతో  ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘వకీల్ సాబ్’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా  ‘వకీల్ సాబ్’  ఫస్ట్ లుక్, వర్కింగ్ స్టిల్స్ ఫ్యాన్స్‌ను ఉత్తేజపరిచాయి.

ఇక అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘వకీల్ సాబ్’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు మూవీ టీం. ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్, శ్రుతిహాసన్ బైక్ మీద వెళ్తు కనిపించారు.అలాగే పోస్టర్ లో పవన్ కళ్యాణ్ లుక్ సూపర్ ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇంకొక విశేషం ఏంటి అంటే ఈ పోస్టర్‌ ద్వారా ఈ సంక్రాంతికి ‘వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

హిందీ సూపర్ హిట్ ఫిలిం ‘పింక్’కు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. మూడు రోజుల క్రితమే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఎస్ ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే విడుదలైన మగువ మగువ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రఫీ అందించారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.