మెగా ఫ్యామిలి నుండి వచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమౌతున్న చిత్రం ‘ఉప్పెన’ బుచ్చిబాబు దర్శకత్వం వహించారు. వైష్ణవ్ కు జోడిగా కృతి శెట్టి నటించింది. ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. డి.ఎస్.పి అందించిన సంగీతం సూపర్ హిట్ అయ్యింది. కాగా ఈ చిత్ర ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. “అబద్దాలాడితే ఆడపిల్లలు పుడతారంట మరి ఆ పిల్ల అంతందంగా ఉందంటే ఆళ్ళ నాన్న మర్డర్ ఎమన్నా చెసాడంటావేట్రా” అంటూ మొదలయ్యి “నువ్వంటే నాకు అదో మాదిరి ఇష్టం బేబమ్మ” అని హీరో చెప్పే డైలాగులు చివర్లో విజయ్ సేతుపతి “ప్రేమ అంటే చరిత్రలో ఉండాలి కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటె దానికి విలువుండదు రా” అనే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. టీజర్ లో విజువల్స్ చాలా బాగున్నాయి. ఫ్రేమ్స్ కూడా కథకి తగినట్టుగా ఉన్నాయి. వైష్ణవ్ యాక్టింగ్ కూడా బాగా చేసాడు. ఈ నెల 12న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మొదటి సినిమాతో వైష్ణవ్ హిట్ కొడతాడో లేదో చూడాలంటే వేచి చూడాల్సిందే.