ఈసారి ఫుల్ మీల్స్ పక్కా అంటోన్న నాని

న్యాచురల్ స్టార్ నాని నటిస్తోన్న తాజా చిత్రం టక్ జగదీష్. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దాదాపు పూర్తి చేసుకుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న విషయం తెల్సిందే. ముందే చెప్పినట్లు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. సాధారణంగా నాని సినిమాలు అంటే మెజారిటీ సాఫ్ట్ గానే ఉంటాయి. కానీ టక్ జగదీష్ లో ఈసారి భిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు నాని. సాఫ్ట్ లుక్ లో ఉంటూనే మాస్ గా ట్రై చేసాడు. కావాలంటే ఈ ఫస్ట్ లుక్ చూడండి. నాని హంగామా ఎలా ఉందో. ఈ చిత్రంలో జగదీష్ నాయుడు అనే పాత్రను పోషిస్తున్నాడు. ఈసారి ఫుల్ మీల్స్ అయితే పక్కా అని అంటున్నాడు. అలాగే తమ సినిమా ఏప్రిల్, 2021లో విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించాడు. ఇక నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ టక్ జగదీష్ ను నిర్మిస్తోంది. ఎస్.ఎస్ థమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.