ప్రస్తుతం షూటింగ్ కి బ్రేక్..? ‘థాంక్ యు’

యువ కథానాయకుడు అక్కినేని నాగ చైతన్య సినిమాలతో బిజీగా ఉన్నాడు. మజిలి, వెంకి మామా చిత్రాలతో బ్యాక్ తో బ్యాక్ హిట్స్ కొట్టిన చైతన్య మరో హిట్ తో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ లోనే విడుదల అయ్యి ఉండాలి కాని కరోన కారణంగా చిత్ర విడుదలను వాయిదా వేశారు. ఆ చిత్రం నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ లాంటివి విశేష ఆదరణను చూరగొన్నాయి.

ఇక లవ్ స్టోరీ తర్వాత ఆయన చేస్తున్న మరో చిత్రం థాంక్ యు. క్రియేటివ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతన్యకు జోడిగా రాశి ఖన్నా నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరాం ఈ చిత్రానికి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో 2020 ఆగస్ట్ లో అనౌన్స్ అయిన ఈ సినిమా ఆక్టోబర్ లో లాంచ్ అయ్యింది షూటింగ్ డిసెంబర్ లో మొదలుపెట్టారు.

ఈ చిత్ర షూటింగ్ కూడా క్లైమ్యాక్స్ కు చేరుకుంది. అయితే కరోన కారణంగా ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ ని తొందరగా ముగించుకుని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు. కరోన కేసులు పెరుగుతున్న నేపధ్యంలో షూటింగ్ చేయటం సబబు కాదని భావించిన చిత్ర బృందం కొన్ని రోజుల విరామం తర్వాత తిరిగి షూటింగ్ చేయడం మంచిదని భావించినట్లు తెలుస్తోంది. మరి ఈ కరోన ఎప్పటి తగ్గుతుందో వేచి చూడాలి మరి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.