అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం చేస్తున్న సినిమా థాంక్యూ. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. విభిన్నమైన చిత్రాలతో తన కెరీర్ ను ముందుకు తీసుకెళుతోన్న విక్రమ్ కె కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నాగ చైతన్య, విక్రమ్ ఇదివరకు మనం సినిమాకు కలిసి పనిచేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ప్రముఖ రచయిత బి.వి.ఎస్ రవి ఈ సినిమాకు కథ అందించడం విశేషం. ఇక ఈ సినిమా షూటింగ్ ను సమ్మర్ కల్లా పూర్తి చేసి జూన్ లేదా జులైలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇంకా ఈ సినిమాలో నటించే హీరోయిన్ల విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీ.సీ శ్రీరామ్ ఈ సినిమా కోసం పనిచేస్తుండగా, ఎస్.ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. థమన్ ఈ రోజు సోషల్ మీడియాలో థాంక్యూ చిత్రం గురించి అప్డేట్ చేస్తూ ఈ సినిమా సాంగ్ రికార్డింగ్ పనులు మొదలయ్యాయి అని కన్ఫర్మ్ చేసాడు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం.
We Start the journey of #ThankYouTheMovie Song Recording from Tom 🎵❤️ along with the wonderful #chennaistringsection with our brilliant @Vikram_K_Kumar for @SVC_official @chay_akkineni 🎵🙌🏿💛
— thaman S (@MusicThaman) January 1, 2021