విడుదలైన థాంక్ యు బ్రదర్ మోషన్ టీజర్

రంగస్థలం సినిమాలో తన నటనతో యాంకర్ గానే కాకుండా నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ ప్రస్తుతం కొత్త సినిమాతో మన ముందుకు రాబోతుంది. థాంక్ యు బ్రదర్ పేరుతో వస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. జస్ట్‌ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మాగుంట శరత్‌ చంద్రారెడ్డి, తారక్‌నాథ్‌ బొమ్మిరెడ్డి నిర్మించారు. ఇక 'థ్యాంక్ యు బ్ర‌ద‌ర్‌’ సినిమా మోషన్ పోస్టర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. మోషన్ టీజర్ చాలా థ్రిల్లింగ్ గా ఉందని మహేష్ బాబు అన్నారు. ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమాలో గర్భవతి ప్రియ క్యారెక్టర్ లో అనసూయ అలాగే అభి పాత్రలో విరాజ్ ఆనంద్ కనిపించబోతున్నారు. ఒక లిఫ్ట్ లో చిక్కుకుపోయిన ఇద్దరు కథతో వస్తున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమాతో రమేష్‌ రాపర్తి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా సురేష్‌ రగుతు, సంగీతం గుణ బాల సుబ్రమణియన్‌ అందిస్తున్నారు. మనసానమః షార్ట్ ఫిల్మ్ లో హీరోగా అందరి దృష్టిని ఆకర్షించిన అశ్విన్ విరాజ్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. పాత్రలో ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండే అనసూయ ఇప్పుడు ఈ చిత్రంలో చేస్తుండటంతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.