
రంగస్థలం సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకుని సినిమా ఆఫర్లు దక్కించుకుంటోంది అనసూయ. 36 ఏళ్ల వయసులో కూడా వన్నె తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి. మాస్ మహారాజా సినిమాలో కూడా అనసూయ నటిస్తోంది. సినిమాలతోనే కాకుండా టి.వి షోస్ తో కూడా ఈ భామ ప్రేక్షకులను అలరిస్తోంది

అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘థాంక్యూ బ్రదర్’. రమేష్ రాపర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమైంది. యువకుడికి, గర్భవతిగా ఉన్న మహిళ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు, వారి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం ట్రైలర్‌ను అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. రెబల్‌స్టార్ ప్రభాస్, సూపర్‌స్టార్ మహేశ్, వెర్సటైల్ యాక్టర్ రానా దగ్గుబాటి సహా నెటిజన్స్ అందరినీ ట్రైలర్ ఆకట్టుకుంది.

ఏప్రిల్ 30న విడుదల కానున్న ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం రిలీజ్ డేట్‌ను అక్కినేని నాగచైతన్య ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం క్లైమాక్స్‌ను అసలు మిస్ చేసుకోకండి’ అని ట్వీట్ చేశారు చైతన్య. హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ సమర్పణలో ఆసక్తి కరంగా ఉండే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎగ్జయిటింగ్ క్లైమాక్స్‌తో రూపొందిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అద్భుతమైన విజువల్స్, టాలెంటెడ్ యాక్టర్స్, టెక్నీషియన్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను చివరి నిమిషం వరకూ ఎంగేజ్ చేస్తుంది.