
కంటెంట్ బావుంటే చిన్న చిత్రాలని కూడా మన ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ మధ్యకాలంలో ఎన్నో చిన్న చిత్రాలు పెద్ద విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు కేవలం థియేటర్ ఆడియెన్సే కాకుండా ఓ.టి.టి ఆడియెన్స్ కూడా తోడయ్యారు. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా లాంటి ఓ.టి.టి సంస్థలు మంచి కంటెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఇప్పటి నిర్మాతలు కూడా ధైర్యం చేసి విన్నూత్నమైన కాన్సెప్ట్స్ ని తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు.

ఈ కోవలోనే ‘V’ ప్రొడక్షన్ హౌస్ సంస్థ నిర్మాణ సారధ్యంలో, మనోజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘తెర కోసం వేషాలు’. ఈ చిత్రం యొక్క మొదటి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది సినిమా టీం. ఈ సందర్భంగా నిర్మాత శ్రీను సునీల్ మాట్లాడుతూ "జీవన్ రెడ్డి చెప్పిన కథ చాలా బాగుంది. వెంటనే షూటింగ్ మొదలుపెట్టాం. షూటింగ్ అంత పూర్తి అయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సినిమాలో నటించాలని తెరపై తమను తాము చూసుకోవాలని, సినీరంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు యువకులు చేసే ప్రయత్నమే ఈ సినిమా కథ. అయితే ఆ యువకులకి కరోనా ఎలాంటి సమస్యలు తెచ్చింది, వాళ్ళు వాటిని ఎలా ఎదురుకున్నారో తెలియాలి అంటే సినిమా కోసం మీరు ఎదురుచూడాల్సిందే. ఈ వారంలో ప్రొమోషనల్ సాంగ్ ని విడుదల చేసి. ఆ వెంటనే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొని వస్తాం. మా టీం కి ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం అని నిర్మాత అన్నారు.