#Shukra movie teaser will be out on 10th Dec.
— BARaju (@baraju_SuperHit) December 1, 2020
Stay tuned...!!
Starring #Arvindkrishna #SrijitaaGhosh
Directed by #Sukupurvaj#JagadeeshBommisetti#Ashirvad #Riapurvaj pic.twitter.com/UDCKGyLpM3
ఈ మధ్యకాలంలో ఓటిటి ప్లాటుఫామ్స్ ఎక్కువ అయేకొద్ది చిన్న సినిమాలకి ఆదరణ పెరుగుతుంది. అప్పట్లో థియేటర్స్ దొరకక చాలా ఇబ్బంది పడే చిన్న సినిమా ఇప్పుడు ప్రేక్షకుల దగ్గరికి డైరెక్ట్ గా చేరుతుంది. అలాగే ఇప్పుడు కొత్తగా శుక్ర అనే థ్రిల్లర్ సినిమా కూడా రాబోతుంది. ఇట్స్ మై లవ్ స్టొరీ సినిమాలో నటించిన అరవింద్ కృష్ణ శుక్ర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అలాగే ప్రముఖ నటుడు సర్జిత్ ఘోష్ కూడా ఈ చిత్రంలో నటించడం ఇంకో విశేషం. అయితే ఈ సినిమా టీజర్ డిసెంబర్ 10 న విడుదల కాబోతుంది అని మూవీ టీం తమ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇప్పటికే రిలీస్ చేసిన పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఒక డెడ్ బాడీ ని పట్టుకొని హీరో అరవింద్ కృష్ణ ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు. అలాగే కొత్త దర్శకుడు సుకుపర్వేజ్ ఈ సినిమా కి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్ర మూవీకి సంగీతం ఆశీర్వద్ అందిస్తున్నారు. ఈ సినిమాని పద్మనాభరెడ్డి గారు ప్రగ్యా ఫిలిమ్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ తో అలరించిన శుక్ర ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి అంటే డిసెంబర్ 10 వరకు ఆగాలి.