మొదలైన గుణశేఖర్ ‘శాకుంతలం’

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ కు మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో శాకుంతలం సినిమా కోసం గ్రీన్ స్క్రీన్ తయారు చేస్తూ టెక్నిషియన్స్ బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్  దాదాపుగా మొత్తం సెట్ లో అలానే గ్రీన్ స్క్రీన్ లో నడుస్తుంది. అందుకోసం ముందుగానే అన్ని రెడీ చేస్తున్నారు మూవీ టీం. శకుంతల మరియు దుష్యంతుడి కథను 1789లో సర్ విలియమ్స్ జాన్స్ ట్రాన్స్ లేట్ చేశాడు. ఆ తర్వాత వందేళ్లకు అంటే 1889 ఆ కథను మొత్తం 46 భాషల్లోకి అనువదించి నాటకంగా ప్రదర్శించడం జరిగింది. ప్రెంచ్.. ఆస్ట్రేలియన్.. ఇటాలియన్ ఇలా 46 భాషల్లో శాకుతలం నాటకంగా ప్రదర్శించారు. ఈ నాటకాన్ని గుణ శేఖర్ ఇప్పుడు సినిమాగా మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. ఈ సినిమాని నీలిమ గుణశేఖర్ భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.