Dynamic Star @Siva_Kartikeyan & director @Psmithran's Tamil Hit #Hero is now releasing in Telugu as #Shakti at Theatres on 11th Dec @AbhayDeol @GangaEnt_ @kjr_studios #KotapadiJRajesh @akarjunofficial @kalyanipriyan @thisisysr @george_dop @AntonyLRuben @PulagamOfficial pic.twitter.com/rJIFOFAgUe
— BARaju (@baraju_SuperHit) December 5, 2020
‘రెమో’, ‘సీమ రాజా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శివ కార్తికేయన్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘హీరో’. అభిమన్యుడు సినిమాతో తెలుగు తమిళంలో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు చేశారు. తమిళ్లో గతేడాది డిసెంబర్లో విడుదలై ఘనవిజయం సాధించిన ‘హీరో’ చిత్రాన్ని ‘శక్తి’ పేరుతో తెలుగులో అనువదించారు. కే.జి.ఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో కోటపాడి జె.రాజేష్ ఈ చిత్రాన్ని డిసెంబర్ 11 న థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వల అనుమతితో ఈ మధ్యనే మొదలైన థియేటర్స్ లో ఇప్పటికే ఒకసారి విడుదలై టీ.వీలలో కూడా వచ్చిన ఈ శక్తి సినిమాని విడుదల చేయబోతున్నారు. విద్యారంగంలోని అవినీతి కార్యకలాపాలు అంటే నకిలీ సర్టిఫికేట్స్ తయారీ కారణంగా ఎందరో అమాయకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఇందులో వీటన్నింటినీ సమాజంలో నుంచి తొలగించాలనుకునే ఓ సాధారణ వ్యక్తిగా కార్తికేయన్ కనిపిస్తాడు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా క్రేజ్ పెంచుకుంటున్న శివ కార్తికేయన్ కి ఈ శక్తి సినిమా ఏమాత్రం ఉపయోగపడతుందో డిసెంబర్ 11 వరకు వేచి చూడాలి.