వ్యవస్థ పునాదులే కరప్ట్ అయినప్పుడు...వ్యవస్థ కూడా కరప్టే

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా, క్రియేటివ్ డైరెక్టర్ దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్’. జగపతి బాబు, రమ్య కృష్ణన్, ఐశ్వర్య రాజేష్ ముఖ్యపాత్రల్లో నటించారు. రాజకీయ నేపధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జె.బి ప్రొడక్షన్స్ బ్యానర్ పై జె. భగవాన్, జె.పుల్లారవులు సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించగా, ఎమ్.సుకుమార్ సినిమాటోగ్రఫర్ గా పని చేసారు. ఈ చిత్రాన్ని జూన్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇటీవల విడుదల చేసిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులకు ప్రజలు, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎలా వారికి బానిసలు అవుతున్నారో ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి డెప్త్ ఉన్న కంటెంట్ ని హ్యాండిల్ చేయడంలో దేవా కట్టా దిట్ట అనేది తెలిసిన విషయమే. ఇది వరకు అయన తీసిన ప్రస్థానం సినిమా ఎటువంటి కల్ట్ స్టేటస్ ను సొంతం చేసుకుందో తెలిసిందే.

ఇక ఈ టీజర్ చూడటానికి బాగుంది. కొన్ని సీన్స్ మనల్ని ఆలోచింపచేస్తాయి. ఇందులో సాయి ధరమ్ ఒక ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రమ్య కృష్ణన్, జగపతిబాబులు రాజకీయ నాయకులుగా కనిపిస్తారు. మరి ఈ చిత్రంతో సాయి మంచి హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.