రెడ్ విడుదలను అధికారికంగా ప్రకటించిన రామ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన చిత్రం రెడ్. నిజానికి ఈ సినిమా షూటింగ్ మార్చ్ లోనే పూర్తయింది. ఏప్రిల్ లో చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు మూతబడ్డాయి. ఆ తర్వాత ఓ.టి.టిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చాలానే ఆఫర్లు వచ్చాయి కానీ దానికి రామ్ ససేమీరా అన్నాడు. రెడ్ చిత్రాన్ని థియేటర్లలోనే ఆస్వాదించాలని అన్నాడు. ప్రస్తుతం మళ్ళీ మాములు పరిస్థితులు మెల్లగా కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్ రిలీజ్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను రామ్ విడుదల చేసాడు. ముందునుండే ప్రచారంలో ఉన్నట్లుగానే రెడ్ ను సంక్రాంతి బరిలో దింపాడు. ఈ ప్రకటనతో పాటు ఒక ఆసక్తికర వీడియోను కూడా జత చేసాడు. ఇక డిసెంబర్ 24న రెడ్ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ట్రైలర్ విడుదలతో ప్రమోషన్స్ షురూ అవుతాయి. కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని తెరకెక్కించగా మణిశర్మ సంగీతం అందించాడు. స్రవంతి రవికిశోర్ నిర్మాత. మరి ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్న రామ్, అదే ఊపును రెడ్ తో కూడా కొనసాగించగలడా అన్నది చూడాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.