
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో బాలివుడ్ స్టార్ హీరో అజేయ్ దేవగన్ ముఖ్యపాత్ర పోషిస్తున్న సంగంతి తెలిసిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతరామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా ఇతర ముఖ్యపాత్రల్లో ఆలియా భట్, ఒలివియ మోరిస్, అజేయ్ దేవగన్, శ్రియ శరన్, సముధ్రఖని, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే అల్లూరి, భీమ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, టీజర్స్ విడుదల చేసేసారు. వాటికి వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
నేడు అజేయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. లోడ్, ఎయిమ్, షూట్ అంటూ ఈ మోషన్ పోస్టర్ సాగుతుంది. తన చుట్టూ గుండెల మీదకు తుపాకులు ఎక్కుపెట్టి ఉన్న సిపాయిలు, ఎటువంటి జంకు లేకుండా రొమ్ము విరిచి వారికి ఎదురు నిలబడి ఒక యుద్ధవీరుడిని తలపిస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ఆయన పాత్రకు మంచి పేరు రావాలని అలాగే అయన మరిన్ని గొప్ప పాత్రలు చేయాలని కోరుకుంటూ మీడియా9 నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.