
తెలుగు సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి రాజమౌళి. ఆయన బాహుబలి తీసేవరకు మన తెలుగు సినిమా మార్కెట్ కేవలం మనకు, మహా అయితే దక్షిణాది వరకూ మాత్రమె ఉండేది. బాహుబలి తర్వాత మన స్థాయి దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. దీనికి కారణం రాజమౌళి అన్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. టాలివుడ్ స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం కాబట్టి ఈ చిత్రంపై అంచనాలు భారి స్థాయిలో ఉన్నాయి పైగా ఇందులో బాలివుడ్ తో పాటు హాలివుడ్ కి చెందిన నటీ నటులు ఇతర దక్షిణాది భాషలకు చెందిన నటులు కూడా నటిస్తుండడంతో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో ఆక్టోబర్13న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగిపోయినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం భారి రేటుకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ చిత్రం 300 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. బాలివుడ్ లో ఈ చిత్రం 200 కోట్లకు, తమిళ్లో 100 కోట్లకు, కన్నడలో 100 కోట్లకు, మలయాళంలో 50 కోట్లకు, ఓవర్సీస్ 100 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం ఇలా మొత్తంగా 900 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకూ అత్యంత ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. బాహుబలి సినిమాకు జరిగిన బిజినెస్ 500 కోట్లు మాత్రమే. ఇక ఈ సినిమాకి జక్కన్న రెమ్యునరేషన్ మీద ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఈ చిత్రానికి ఆయన 100 కోట్లు తీసుకుంటున్నాడని కొందరు అంటుంటే, కొందరు ఆయన ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నాడని కొందరు అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వాస్తవాలేవి తెలీదు కనుక ఆయన రెమ్యునరేషన్ ఎంత అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే