పవన్ బాట అదే... రూట్ మార్చడ


పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఒక క్రేజ్ ఉంటుంది. ఆయన నటించే సినిమాలకి అభిమానులు ఎలా ఎగబడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులు సినిమా సినిమాకి పెరుగుతూ వచ్చారు. కెరీర్ మొదటి నుంచి ఆయన ఎక్కువగా రిమేక్ చిత్రాలే చేసారు. గోకులంలో సీత, సుస్వాగతం, మొదలుకుని గబ్బర్ సింగ్, కాటమరాయుడు లాంటి రిమేక్ లను ఆయన చేసారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి కూడా ఫ్రెంచ్ చిత్రాన్ని పోలి ఉంటుంది. ఆ చిత్రం తర్వాత ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చి రాజకీయాల పై దృష్టి పెట్టారు.


ఇక పవన్ కమ్ బ్యాక్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టైంలో ఆయన బాలివుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ ‘చిత్రాన్ని’ రిమేక్ చేయనున్నట్లు ప్రకటించారు. తాప్సీ పన్ను, బిగ్.బి అమితాబ్ నటించగా అనిరుద్ధ రాయ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 2016 లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఫెమినైన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. స్త్రీల వ్యక్తిగత స్వేచ్ఛను సమాజం ఎలా చూస్తోంది, వారిని స్వేచ్ఛగా ఉండనివ్వకుండా ఎలా అడ్డుకుంటోంది అనేది చిత్రంలో ప్రధాన అంశం.


ఈ చిత్రాన్ని రిమేక్ చేస్తునట్లు పవన్ ప్రకటించిన నాటి నుంచే దీని పై విమర్శలు మొదలయ్యాయి. ఆ పాత్రను ఆయన చేయగలడా లేదా అని కొందరు, కథని మొత్తం మార్చేస్తాడు అని కొందరు అనుకున్నారు. అయితే వాటికి ఊతం ఇస్తునట్లుగా ఉన్నాయి సినిమా నుండి వచ్చే అప్డేట్స్ అన్ని. ఫస్ట్ లుక్ నుండి మొన్న రిలీజ్ అయిన పోస్టర్ వరకూ అన్నిటిలోనూ పవన్ కల్యాణే ముఖ్యం అనిపిస్తోంది. రీసెంట్ గా విడుదలైన లుక్ లో అంజలి, నివేథా థామస్, అనన్య ముగ్గురూ పవన్ కళ్యాణ్ వెనకాల నిలబడుకుని ఉంటారు. ఆయన మాత్రం వీళ్ళ ముందు చైర్ లో స్టైల్ గా కూర్చొని ఉంటాడు. మరి ఆయన పింక్ ని ఏ కలర్ చేస్తాడో వేచి చూడాలి మరి.

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.