టాలీవుడ్ లో కాంటెన్ట్ సరిగ్గా ఉంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అని పట్టించుకోకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా చిన్న సినిమాలు నిరూపించాయి. అయితే ఇప్పుడు తెలుగులో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న చిత్రం పరేషాన్. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రామ్ గోపాల్ వర్మ ద్వారా విడుదల చేసారు. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి మంచి మాస్ సాంగ్ ని మూవీ టీం న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసింది. సవ్ సారా సవ్ సారా చేటక్ అనే ఈ మందు సాంగ్ మంచి బీట్ తో చాలా బాగుంది. ఈ పాటని సంగీత దర్శకుడు యశ్వంత్ నాగ్ కంపోజ్ చేయడమే కాకుండా పాట కూడా ఆయనే పాడారు. ఇక పలాస 1978 సినిమాలో రంగారావు పాత్రలో అద్భుతంగా నటించిన తిరువీర్ ఈ పరేషాన్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పావని కరణం నటిస్తున్నారు. ఇక కొబ్బరి మట్టా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు రూపక్ రోనాల్డ్సొన్ ఈ సినిమాకి కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ పరేషాన్ సినిమాని సిధార్ధ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. చిన్న చిన్న సినిమాలలో మంచి పేరు తెచ్చుకున్న చాలా మంది నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా కొబ్బరి మట్టా లాగా హిట్ అవుతుందేమో చూడాలి.