
తెలుగులో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న యంగ్ హీరో, విశ్వక్ సేన్. ఆయన నటించిన ‘పాగల్’ సినిమా భారి అంచనాల మధ్య విడుదలైంది. చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకుని ఆ ప్రేమను తను ప్రేమించబోయే అమ్మాయిలో వెతుక్కోవాలని తపించే యువకుడు ప్రేమ్. అతని కథే ‘పాగల్’. ప్రేమ్ అనుకున్నట్లుగా అమ్మాయి దొరికిందా? దొరికిన అమ్మాయి తనకు కావాల్సిన ప్రేమను పంచిందా? దాని వల్ల ప్రేమ్ కి ఎదురైనా కాంఫ్లిక్ట్స్ ఏంటి? వాటిని అతను ఎలా ఎదురుకున్నాడు అనేది మిగితా కథ.

కథ ఎలాంటిదైనా స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్. పాగల్ ఫస్ట్ హాఫ్ అంతా ఒక హిలేరియస్ రైడ్ అయితే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైతో సినిమా సాగిపోతుంది. సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ పెర్ఫార్మెసెస్. విశ్వక్, నివేథ పేతురాజ్, మురళి శర్మ తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను డెలివర్ చేసారు.

మురళి శర్మ, విశ్వక్ ల మధ్య నడిచే ట్రాక్ ని చాలా బాగా హ్యాండిల్ చేసాడు దర్శకుడు. ఆ ట్రాక్ కి నవ్వని ప్రేక్షకుడు ఉండడు. ఫస్ట్ హాఫ్ లో ప్రతీ సీన్ కడుపుబ్బా ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. విజ్యువల్స్ అద్భుతంగా ఉంటాయి. సినిమాకి సగం అందం కెమెరానే అనటంలో ఎటువంటి సందేహం లేదు. మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి పాగల్ ఒక ఎంటర్టెయినర్. సరదాగా థియేటర్ కి వెళ్ళి చూసేందుకు మంచి ఆప్షన్.