Intense @saironak3 with loaded Rifle as ANUDEEP IPS. #OdelaRailwayStation@ImSimhaa #HebahPatel #AshokTeja @soundar16 @pujita_ponnada @IamSampathNandi @anuprubens @KKRadhamohan @SriSathyaSaiArt pic.twitter.com/6oswVCpNPJ
— BARaju (@baraju_SuperHit) November 28, 2020
తెలంగాణలోని 'ఓదెల' అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'. ఈ సినిమాలోని ఒక్కక్క క్యారెక్టర్ ని మూవీ టీం ఒక పోస్టర్ తో విడుదల చేస్తుంది. అయితే ఇప్పుడు నటుడు సాయి రోనక్ ని ‘అనుదీప్ ఐ.పి.ఎస్’ క్యారెక్టర్ లో ఒక పోస్టర్ ను ఆ మూవీ టీం విడుదల చేసింది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గౌతమ్ నంద సినిమా దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ సినిమాలో రాధ అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర లో హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తోంది. ఈ మధ్యనే విడుదలైన హెబ్బా పటేల్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి హీరోగా పేరు తెచ్చుకున్న వశిష్ట సింహ తెలుగులో హీరోగా నటిస్తోన్న మొదటి చిత్రమిది. ఈ సినిమాకి కొత్త దర్శకుడు అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల మండల పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్ లో జరిగింది. షూటింగ్ అంత పూర్తి చేసుకున్న మూవీ టీం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనిలో ఉన్నారు. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.