నటుడిగా అతని నూతన అధ్యాయానికి ‘నాంది’

ప్రముఖ నటుడు, హాస్య చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నాంది’. కెరీర్ మొదట్లో ఆయనకు కలిసొచ్చిన జోనర్ లోనే వెళ్ళి అపజయాల పాలయ్యారు. మధ్యలో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేసినప్పటికీ ఆయనకు మంచి పేరొచ్చింది కాని సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. ఆ తర్వాత కూడా అయన కామెడి పాత్రలే చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్య కాస్త రూటు మార్చి నటనకు ప్రాధాన్యమున్న కథలను ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన మహర్షి చిత్రంలోని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఆయన కథానాయకుడిగా నటించిన ‘నాంది’ చిత్రంలోని పాత్ర కూడా నటనకు ఆస్కారమున్న పాత్రే. యువ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మించారు. ప్రముఖ నటులు వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి పులికొండ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ ట్రైలర్ లు మంచి స్పందనను తెచ్చుకున్నాయి. ఇటీవలే విడుదలైన ‘బంగారు బుల్లోడు‘ నిరుత్సాహ పరచడంతో నరేష్ ఆశలన్నీ నాంది పైనే ఉన్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరీ 19న విడుదల కానుంది. ఈ చిత్రంతోనైనా నరేష్ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడో లేదో తెలియాలంటే విడుదల వరకూ ఆగాల్సిందే. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుందాం.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.