Our Movie Team of MURDER interviewing each other..Film releasing on Dec 24 th https://t.co/WuxqUcByem
— Ram Gopal Varma (@RGVzoomin) December 15, 2020
యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తీసే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కెంచిన సినిమా 'మర్డర్'. ఈ సినిమా విడుదలకు సిద్ధమైందని, త్వరలో థియేటర్లకు వస్తుందని ఆర్జీవీ తెలిపారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా మర్డర్ మూవీని నిర్మించాడని ట్రైలర్, పాటలో వాస్తవాలకు దూరంగా ఉన్న అంశాలను చూపించాడని ఆమృత తీవ్ర అభ్యత్తరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నల్గొండలోని మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య కేసు ఆధారంగా ఆర్జీవీ 'మర్డర్' చిత్ర తెరకెక్కించినట్లు చిత్రం ట్రైలర్, పాటను చూస్తే అర్థమవుతోంది. అదే విధంగా 'మర్డర్ మూవీ విడుదలకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ఇక థీయేటర్లలో చంపడానికి 'మర్డర్' సినిమా త్వరలోనే రాబోతుంది' అని ఆయన క్యాప్షన్ జతచేశారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, పాట అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన ఆ పాటను ఆర్జీవీ పాడటం విశేషం. దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ సినిమా తెరకెక్కించాడు. శ్రీకాంత్ అయ్యంగార్, సాహితి తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు. నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మించారు.
తాజా ఈ సినిమా యునిట్ తో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్ వ్యూ లో యాక్టర్స్ శ్రీకాంత్ అయ్యంగార్, గాయత్రి భార్గవి , దర్శకుడు ఆనంద్ పాల్గొన్నరు. పెళ్ళి విషయం లో పిల్లల పెద్దల మనస్తత్వాలు ఎలా ఉంటాయి మరియు మర్డర్ సినిమా గురించి ముచ్చిటించారు.