Romantic entertainer #MrsAndMiss is slated for January 2021 in Theaters.
— BARaju (@baraju_SuperHit) December 5, 2020
A Crowd Funded film Directed by @AshokReddy_T#SaileshSunny @GnaneswariKand2 @yashwanth @siddammanohar pic.twitter.com/4xR9ALTy1H
ప్రస్తుతం సినిమాలలో జనాలు కంటెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఎంత చిన్న సినిమా అయిన ఆదరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది కొత్త దర్శకులు సొంతంగా సినిమాలు తీసి విడుదల చేయాలని అనుకుంటున్నారు. అలాగే కొత్తగా మిస్టర్ & మిస్ అనే ఒక ఇండిపెండెంట్ సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు అశోక్ రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కొత్త నటులు శైలేష్ సన్నీ, జ్ఞానేశ్వరి కలిసి నటిస్తున్నారు. లాక్డౌన్ ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోన వలన థియేటర్స్ మూతపడటంతో పోస్ట్ అవుతూ వచ్చింది. ఇక ఇప్పటికి జనవరి 2021లో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని ప్రముఖ పి.ఆర్.ఓ బి.ఎ. రాజు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ సుధీర్ వర్మ అందించారు. ఇప్పటికే విడుదలైన మిస్టర్ & మిస్ సినిమా టీజర్ లో హీరో, హీరోయిన్స్ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ టీజర్ కి కూడా మంచి స్పందన వచ్చింది. తెలుగులో చాలా తక్కువ వచ్చే ఇలాంటి ఇండిపెండెంట్ సినిమాలో ఈ మిస్టర్ & మిస్ ఎంతవరకు హిట్ అవుతుందో థియేటర్స్ లో విడుదలైయే వరకు ఎదురుచూడాలి.అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్స్ చాలా ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తున్నాయి.