విడుదలైన మేజర్ ఫస్ట్ లుక్

Happy to present the first look of #Major!! Wishing you a very happy birthday Sesh Adivi. I'm sure Major will go down as one of your best performances. Good luck and happiness always! 😊

Posted by Mahesh Babu on Wednesday, December 16, 2020

అడివి శేష్ కథల ఎంపిక ఎప్పుడు కొత్తగా మరియు విభిన్నంగా ఉంటుంది. క్ష‌ణం, గూఢచారి వంటి సినిమాల్లో త‌నదైన న‌ట‌న‌తో మంచి నటుడిగా కూడా పేరు తెచ్చుకున్న అడివి శేష్ ప్ర‌స్తుతం ‘మేజర్’ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా మేజర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. అడివి శేష్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ మహేష్ బాబు ఈ ఫస్ట్ లుక్ ను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేసారు. వీర మరణం పొందిన మేజర్ ఉన్ని కృష్ణన్ జీవిత నేప‌థ్యంలో ఈ సినిమాని ప్యాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్నారు. మహేష్ బాబు సొంత నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీలో ఒకేసారి విడుదల కాబోతుంది. ఇక ఈ మధ్యనే ఈ చిత్రం ఎలా పుట్టింది, ఫ‌స్ట్ లుక్ ఎలా చేసాం అన్న‌ది ఇటీవ‌ల ఓ వీడియో ద్వారా తెలియ‌జేశారు అడ‌వి శేష్. గూఢ‌చారి ఫేం శ‌శికిర‌ణ టిక్కా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. హీరోయిన్ గా శోభితా దూళిపాళ్ల న‌టిస్తుంది. కాగా, 26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రినో కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ అన్న సంగ‌తి తెలిసిందే.  

- Advertisement -

You might also like

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.