SHARWANAND - SIDDHARTH: SHOOT BEGINS... #Telugu - #Tamil bilingual #MahaSamudram - starring #Sharwanand, #Siddharth, #AditiRaoHydari and #AnuEmmanuel - commenced shoot today... Ajay Bhupathi - who directed #RX100 - directs the film... Produced by Sunkara Ramabrahmam. pic.twitter.com/NDVw5OqgYF
— taran adarsh (@taran_adarsh) December 7, 2020
యంగ్ యాక్టర్ శర్వానంద్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మహా సముద్రం’ ఈ సినిమాలో అదితి రావు హైదరి శర్వానంద్ కి జోడిగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఆర్.ఎక్స్ 100 చిత్రా దర్శకుడు అజయ్ భూపతి దర్సకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకో విశేషం ఏంటి అంటే చాలా సంవత్సరాల తరవాత తెలుగులో సిధార్ధ నటించబోతున్నాడు. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ సిధార్ధ కి జోడి గా నటిస్తుంది. ఇక ఈ మధ్యనే విడుదల చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ కి చాలా మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచే మొదలైంది. ఈ విషయాన్ని ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ లో మానిటర్ దగ్గరున్న ఫోటోని పోస్ట్ చేసారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో సిధార్ధ కూడా పాల్గొనబోతున్నారు. చాలా సంవత్సరాల తర్వాత సిధార్ధ తెలుగు సినిమాలో నటించడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి వచ్చే సంవత్సరం మొదట్లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాని ఎ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.