లవ్ స్టొరీ సినిమా నుంచి న్యూ ఇయర్ పోస్టర్

తనదైన స్టైల్ లో కూల్ గా ప్రేమ కథలను తెరకెక్కించి ప్రేక్షకులను తన మాయలో పడేయటంలో దిట్ట డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల. ఈయన సినిమా అంటే యూత్ లో బాగా క్రేజ్. ఇప్పటికే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శేఖర్ కమ్ముల ఇప్పుడు కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నారు.

ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరీ’ . ఈ మూవీ టీం న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్తూ ఒక కూల్ పోస్టర్ ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు. ఈ పోస్టర్ లో నాగ చైతన్య , సాయి పల్లవి ఇద్దరు హైదరాబాద్ రోడ్లు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు.

కరోన లాక్డౌన్ వల్ల 2020లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా 2021 లో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన లవ్ స్టోరీ పోస్టర్స్ మరియు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. యువ సంగీత దర్శకుడు పవన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది . ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉన్న ఈ మూవీ టీం త్వరలోనే సినిమాని విడుదల చేయడానికి చూస్తున్నారు. శేఖర్ కమ్ముల గత ప్రేమ కథ సినిమల్లగానే ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Happy New Year ... From Team #lovestory

Posted by Sekhar Kammula on Thursday, December 31, 2020
- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.