మాస్ మహారాజా రవితేజ వరస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. ప్రస్తుతం రవితేజ నటించిన క్రాక్ విడుదల సన్నాహాల్లో ఉంది. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నా కానీ థియేటర్ల సమస్య కారణంగా 5 రోజులు ముందుగా జనవరి 9న క్రాక్ విడుదల కానుంది.
ఇక రవితేజ క్రాక్ తర్వాత నటిస్తోన్న చిత్రం ఖిలాడీ. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాను రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. న్యూ ఇయర్ సందర్భంగా ఖిలాడీ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా ఉంది. రవితేజ డబల్ రోల్ లో నటిస్తున్నాడు. ఈ డబల్ రోల్ కూడా ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్ అన్న సంకేతాలను ఇస్తోంది ఈ ఫస్ట్ లుక్. "ఈ సమ్మర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నాం, హ్యాపీ న్యూ ఇయర్" అని రవితేజ ట్వీట్ చేసాడు. మరి ఈ సినిమాతో రవితేజ సక్సెస్ ను అందుకుంటాడేమో చూడాలి.