
అక్కినేని సుమంత్, కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కపటధారి’. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘కావలుధారి’ చిత్రానికి ఇది రీమేక్. అంధాధున్ చిత్రానికి స్క్రీన్ ప్లే విభాగంలో పనిచేసిన హేమంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం చక్కటి ప్రేక్షధారణతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. కాగా సుమంత్ నటించిన ‘కపటధారి’ చిత్రం విడుదలకు సిద్దమైంది. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన హేమంత్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా, ప్రదీప్ కృష్ణ మూర్తి దర్శకత్వం వహించారు. రేసేంట్ గా విడుదల చేసిన ట్రైలర్ సినిమపై అంచనాల్ని పెంచేసింది. ఫిబ్రవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రొమోషన్స్ ముమ్మరం చేసింది చిత్ర బృందం. 8న ఈ చిత్ర పాటలను యుట్యూబ్ లో విడుదల చేసింది. ఒక మర్డర్ చుట్టూ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. కెరీర్ మొదట్లో మూస ధోరణిలో వెళ్ళిన సుమంత్ తన పంథాను పూర్తిగా మార్చుకున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమె ఎంచుకుంటున్నారు. ఈ చిత్రం విజయాన్ని అందుకుని ఆయనకు నటుడిగా మంచి పేరు తీసుకురావలని కోరుకుందాం.