తెలుగు తెరపై మరో డేర్ స్టెప్ ‘జాతి రత్నాలు’

మార్చ్ 11న థియేటర్లలో విడుదలైన చిత్రం ‘జాతి రత్నాలు’. నిజానికి పోయినేదాడే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉన్నా కరోన కారణంగా విడుదల కాలేదు. అయితే దీన్ని చిత్ర బృందం క్యాష్ చేసుకుంది. సినిమా విడుదల లేట్ అవుతుంది అని టెన్షన్ పడి పోకుండా రిలీజ్ కి కావలసిన టైమ్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ టైమ్ ని ప్రొమోషన్స్ కి వాడుకున్నారు. సేలబ్రిటీస్ అనే ఫెలింగ్ లేకుండా నవీన్ పొలిశెట్టి, అనుదీప్, ఫరియా, ప్రియదర్శి అందరూ కలిసి విన్నూత్నంగా సినిమాని ప్రమోట్ చేసుకున్నారు. సినిమా తీసేటప్పుడు ఎంత కష్టపడ్డారో ప్రమోషన్స్ లో కూడా అంతే కష్టపడ్డారు. దాంతో సినిమా జనాల్లోకి వెళ్ళి సినిమాకి వచ్చేలా చేసింది.


ఇక సినిమా విషయానికి వస్తే దర్శకుడు కంప్లీట్ కామెడి సినిమా అందించడమే లక్ష్యంగా పెట్టుకుని సినిమాని తీశారు. లోతుగా చూస్తే కొన్ని సీరియస్ విషయాలని కూడా ఆయన చర్చించారు. ఎక్కడా కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా చాలా బాగా కథను రాసుకున్నారు దర్శకుడు. ఆయన రాసుకున్న క్యారెక్టర్స్ సినిమాకి ప్రధాన బలం. ఇలాంటి డంబ్ కామెడి అనుకున్నప్పుడు క్రేజీ క్యారెక్టర్స్ కథను నడిపిస్తాయి. జాతి రత్నాలు విషయంలో కూడా అదే జరిగింది. ముగ్గురు అమాయకులు ఒక చేయని నేరంలో ఇరుక్కోవడం దాని నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది సినిమా కథ. దీన్ని ఎలా తీయొచ్చు అనేది దర్శకుడి పై ఆధార పడి ఉంటుంది. ఈ పాయింట్ ను సీరియస్ గా కూడా తీసి ఉండొచ్చు కాని ఇప్పటికే అలా చాలా సినిమాలు వచ్చాయి.


కథలో వచ్చే సీన్స్ ఎక్కడా చూసినట్టు ఉండవు చాలా వరకు అన్నీ ఫ్రెష్ సీన్సే. క్లైమాక్స్ లో వచ్చే కోర్ట్ సీన్ పాతదే అయినా కొత్తగా ఉంటుంది. దర్శకుడు ఆ సీన్స్ ఒక సెటైర్ లాగా తీసాడేమో అనిపిస్తుంది. చాలా సినిమాల్లో ఇలాంటి కోర్ట్ సీన్స్ ఉంటాయి. అవి చాలా సీరియస్ సినిమాలు అందులో నేరం మోపబడ్డ హీరో తన కేసును తనే వాదించుకుంటాను అని అంటాడు. జడ్జ్ కూడా అందుకు ఒప్పెసుకుంటాడు. అదేంటో తెలియదు వాళ్ళ కేసులు వాళ్ళే వాదించుకుంటే లాయర్లు ఎందుకు. కాని ఇందులో అలాంటిది ఏమి జరగదు కోర్ట్ సీన్స్ చాలా బాగా పండాయి. జడ్జ్ గా బ్రహ్మానందం గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి పాత్రలో కనిపించారు. సింపుల్ గా చెప్పాలంటే సినిమా చూసి రెండున్నర గంటలు హాయిగా నవ్వుకోవచ్చు. ముఖ్య గమనిక ఇది జబర్దస్త్ కామెడి కాదు. ఇందులో కూడా లాజిక్స్ ఉన్నాయి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.