తెలుగు సినిమాకి డ్యాన్స్ పరిచయం చేసింది అక్కినేని నాగేశ్వరరావు అంటుంటారు అందరూ. ఆయన మనవడు, నాగార్జున మేనల్లుడు సుశాంత్ మంచి డ్యాన్సర్. 'అల... వైకుంఠపురములో' సినిమాలోని 'రాములో రాములా' పాటలో తనకంటే సుశాంత్ బాగా డ్యాన్స్ చేశాడని అల్లు అర్జున్ చెప్పారు. ఇప్పటివరకూ పాటల కోసం సెట్స్ లేదా లొకేషన్లలో డ్యాన్స్ చేసిన సుశాంత్, 'ఇచట వాహనములు నిలుపరాదు' సినిమాలో ఓ పాట కోసం తొలిసారి పబ్లిక్‌లో డ్యాన్స్ చేశాడు. అప్పుడు బాగా సిగ్గుపడ్డానని చెప్పుకొచ్చాడు. కాళిదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుశాంత్, కరెంట్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చి.ల.సౌ సినిమాతో క్లాస్ హిట్ కొట్టాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని సపోర్టింగ్ క్యారెక్టర్ తో అదరగొట్టెశాడు. ప్రస్తుతం సుశాంత్ నుంచి వస్తున్న సినిమా ఇచ్చట వాహనములు నిలుపరాదు. నొ పార్కింగ్ అనేది క్యాప్షన్. సుశాంత్ క్రిస్మస్ రోజున ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్ లో హిరో హిరోయిన్స్ టీ తాగుతూ క్యూట్ జోడిగా ఉన్నారు. సుశాంత్ ఈ పోస్టర్ పెడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సినిమాకి రవి శంకర శాస్త్రీ, ఎక్తా శాస్త్రీ, హారీష్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎస్.దర్శన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నారు. ఎమ్.సుకుమార్ చాయగ్రహణం అందించారు.