Here is the first look of riveting drama #Hangman.@actorbrahmaji
— BARaju (@baraju_SuperHit) December 16, 2020
Directed by #Vihaan
Produced by #chlorofylmpictures pic.twitter.com/X3SBqWDeFr
తెలుగులో కామెడీ పాత్రలు చేయడంలో బ్రహ్మాజీది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన హీరోలకి ఫ్రెండ్ గా చాలా సినిమాల్లో మెయిన్ క్యారెక్టర్స్ చేశారు. బిసినెస్ మ్యాన్, మిరపకాయ్ లాంటి సినిమాల్లో ఆయన కామెడీతో అందర్నీ నవ్వించిన బ్రహ్మాజీ, ఇప్పుడు ఆయన మెయిన్ క్యారెక్టర్ గా ఒక సినిమా రాబోతుంది. హ్యాంగ్ మ్యాన్ పేరుతో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలయ్యింది. ఈ పోస్టర్ లో బ్రహ్మాజీ ఒక చాపని పట్టుకొని కనిపించారు. తనతో పాటు ఒక కొత్త నటుడు ఒకరు కూడా కనిపించారు. ఈ హ్యాంగ్ మ్యాన్ సినిమాకి కొత్త దర్శకుడు విహాన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాని క్లోరో ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు. చూడటనికి కొత్తగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ ని హీరో సత్యదేవ్ విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ని బట్టి సినిమా కూడా కొత్తగా ఉండబోతుంది అని చెప్పొచ్చు. ఈ సినిమాకి కమ్రాన్ అనే కొత్త సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నారు. ఈ మధ్య తెలుగులో కొత్త కాన్సెప్ట్ ని బాగా ప్రోత్సహిస్తున్నారు అలాగే ఈ సినిమాని కూడా ప్రోత్సహిస్తారో లేదో చూడాలి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా నడుస్తుంది.