Glamorous Actress @iamlakshmirai's #Garjana Movie Audio Rights Bagged By @MadhuraAudio @iamvinodjain @iamlakshmirai @Act_Srikanth @ijaguarstudios @nareshjain2682 @mv_panneer @parthibanjayar6@santoshamsuresh pic.twitter.com/rCUUgEGV6j
— BARaju (@baraju_SuperHit) December 15, 2020
దక్షిణాది భామ లక్ష్మీరాయ్ పలు భాషా చిత్రాల్లో గుర్తింపు పొందింది. గ్లామర్ పాత్రల ప్రత్యేక నటిగా, అందచందాల ఆరబోతలో తనకు తానే సాటి అన్నంత బోల్డ్ గా ప్రదర్శన చేస్తుంది లక్ష్మీరాయ్. లక్ష్మీరాయ్ కొంత గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ సినిమాలపై ఆమె దృష్టి సారించారు. తమిళ, మలయాళ చిత్రాలపై ఆమె తాజాగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లామర్ పాత్రలపై తనవైన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఒకే విధమైన మూస పాత్రల్లో కనిపించడం నాకు ఇష్టం ఉండదు. కొన్నిసార్లు పాత్రలకు తగినట్లుగా బోల్డ్ గా కనిపించాల్సి వస్తుంది అని చెప్పుకొచ్చారు. తాజాగా లక్ష్మీ రాయ్ నటించిన సినిమా గర్జన ఆడియో రైట్స్ ని మధుర ఆడియో సొంతం చేసుకుంది ఈ విషయం బి.ఎ రాజు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ఈ సినిమాలో లక్ష్మీ రాయ్ కి జోడి గా తమీళ నటుడు శ్రీకాంత్ నటించారు. అలాగే ముఖ్య పాత్రలో దెవ్ గిల్, నైరా, వైష్ణవి నటించారు. జె ప్రతిభన్ దర్శకత్వం వహించారు. మ్యూజిక్ అరుల్ దేవ్ అందించారు. ఎడిటర్ గా ఆర్.సుదర్శన్ పని చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గా మిలన్ పనిచేశారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓ గా సురేశ్ కొండెటి చెయ్యడం విశేషం. ఈ చిత్రానికి బి వినోద్ జైన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.