Wrapped Up our #GaaliSampath's Vizag Schedule in Sudigali way🌪 🎬 & also Done with 80% Shoot 💪🏽🤘🏽
— BARaju (@baraju_SuperHit) December 16, 2020
Cant wait to Share this amazing Experience with u all Soon 🤩@AnilRavipudi @sreevishnuoffl #RajendraPrasad @YoursSKrishna #Anish @achurajamani @shine_screens @imagesparkent pic.twitter.com/mCHdhhtbI3
శ్రీవిష్ణు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం గాలి సంపత్. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందిస్తూ సమర్పిస్తోన్న ఈ చిత్రం మొదటి నుండి మంచి అంచనాలను కలిగించింది. అరకులో ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం గాలి సంపత్ షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయ్యిందిట. టైటిల్ కు తగ్గట్లుగానే సుడిగాలి స్పీడ్ లో షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. అరకు షెడ్యూల్ తర్వాత గాలి సంపత్ షూటింగ్ వైజాగ్ లో మొదలైంది. ఇప్పుడు ఆ వైజాగ్ షెడ్యూల్ కూడా పూర్తయింది. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో, శ్రీ విష్ణు తండ్రిగా మరియు టైటిల్ పాత్రలో కనిపించనున్నాడు. ఎస్ కృష్ణ ఈ సినిమాకు కథ అందించి నిర్మిస్తుండగా అనీష్ దర్శకత్వం వహిస్తున్నాడు. లవ్లీ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అచ్చు రాజమణి ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. గాలి సంపత్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.