
ప్రముఖ దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. ఇప్పటి వరకూ సరైన హిట్ కొట్టలేదు. రిలీజ్ అయిన అన్ని సినిమాలు ఫ్లాప్స్ దీంతో అతని కెరీర్ కష్టకాలంలో పడింది. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా కార్తిక్ రాపోలు తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మేర్లపాక గాంధి ఈ చిత్రానికి కథ అందించారు.

సంతోష్ ఈ చిత్రంపై గట్టి ఆశలనే పెట్టుకున్నాడు. సంతోష్ కి హిట్స్ లేకపోవడంతో అతని కెరీర్ ని గాడిలో పెట్టె భాద్యతను డార్లింగ్ ప్రభాస్ తీసుకున్నాడు. ప్రభాస్ కు తోలి హిట్ ఇచ్చింది శోభన్ గారే అన్న విషయం తెలిసిందే. వర్షం సినిమాతో ప్రభాస్ కి బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాక కెరీర్ కి గట్టి పునాది పడేలా చేసారు. ఈ సినిమాతోనే ఆయనకు విపరీతమైన లేడీ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత ఆయన మరణించారు. ఆయనే ఉండి ఉంటే సంతోష్ కెరీర్ ని ఆయనే చూసుకునే వారు.
ఆయన లేరు కాబట్టే ఆ భాద్యతను మన డార్లింగ్ తీసుకున్నారు. ఆయనే దగ్గరుండి స్టోరి సెలెక్షన్స్ చేస్తున్నారు. అదీకాక అతని ఫిట్నెస్ గురించి, యాక్టింగ్ గురించి కూడా డార్లింగ్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. మరి ప్రభాస్ అతని ఫ్యూచర్ ను మారుస్తాడో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అతను నటించిన ఏక్ మినీ కథ చిత్రం విడుదలకు సిద్ధమైంది.