పవన్ తేజ్, మాఘన హిరో హిరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “ఈ కథ లో పాత్రలు కల్పితం”. ఈ సినిమా తో పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయం అవుతునాడు. మాధవి సమర్పణలో ఎం.వి.టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్ పై అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్ కి, సాంగ్స్ కి మంచి ఆదరణ వస్తోంది. డిసెంబర్ 18న ఈ చిత్ర టీజర్ ని మెగాబ్రదర్ నాగబాబు రిలీజ్ చేసి సినిమా గ్రాండ్ సక్సెస్ కావాలని టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్స్ లలో విడుదల కావడానికి సన్నద్ధం అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజేష్ నాయుడు మాట్లాడుతూ తమ చిత్ర టీజర్ రిలీజ్ చేసిన నాగబాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ సినిమా క్రైమ్ నేపథ్యంలో సాగే మిస్టరీ కథ. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి అందర్నీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టీజర్ లో హీరో నటన, డైలాగ్ డెలివరికీ అందరూ ఇంప్రెస్స్ అవుతున్నారు. ఈ సినిమాలో పృథ్విరాజ్, నవీన్ నేని, రఘబాబు, అభయ్ తదితరులు నటిస్తున్నారు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తన్నారు.