ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ మూవీ ‘డర్టీ హరి’. రుహాని శర్మ, శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్ తదితరలు నటించిన ఈ సినిమా టీజర్ కి సోషల్ మీడియాలో విశేష ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘డర్టీ హరి’ చిత్రాన్ని కొత్త ఓ.టి.టి ప్లాట్ ఫామ్ ఫ్రైడే మూవీస్ లో ఏ.టీ.టీ విధానంలో డిసెంబర్ 18న విడుదల చేయడానికి సన్నాహాలు మొదలైయ్యాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన ట్రైలర్ ని మూవీ టీం విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూడటానికి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా సహజమైన పాత్రలలో నటించిన రుహాని శర్మ ఈ సినిమాలో పెళ్ళి అయిన ఒక అమ్మాయి పాత్రలో హాట్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు ప్రేమ కథలతో మెప్పించిన ఎం.ఎస్ రాజు ఈ రొమాంటిక్ థ్రిల్లర్ కథతో రావడం అందరిలోను అంచనాలని పెంచింది. ఇక డర్టీ హరి చిత్రంతో పాటు ఇంకా పలు సినిమాలు ఈ కొత్త ఏ.టీ.టీ స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. ఫోన్ కాల్ చేసి సినిమా చూసే నూతన విధానాన్ని ఈ కొత్త ఏ.టీ.టీ అందించనుంది. ఈ ఏ.టి.టి డర్టీ హరి సినిమాతో డిసెంబర్ 18న లాంచ్ చేస్తున్నారు. ఈ ఏ.టి.టి ఎంత వరకు ప్రేక్షకులకి దగ్గరవుతుందో చూడాలి.