ఆర్జీవీ థియేటర్ లో కూడా విడుదలవుతోన్న కరోనా వైరస్

రామ్ గోపాల్ వర్మను డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అంటుంటారు. ఏదైనా కొత్త విషయాన్ని అవలంబించడంలో ఆర్జీవీ శైలి వేరు. రీసెంట్ గా వర్మ నుండి నిఖార్సైన సినిమా రాలేదు కానీ ఇప్పటికీ తన బిజినెస్ టాక్టిక్స్ తో ప్రేక్షకులను తన సినిమాలవైపు ఆకర్షించడం వర్మ శైలి. ఈ లాక్ డౌన్ సమయంలో కూడా చాలా బిజీగా గడిపిన ఒకే ఒక్క దర్శకుడు బహుశా రామ్ గోపాల్ వర్మే నేమో. వరసగా రెండు, మూడు సినిమాలను తన సొంత యాప్ ఆ.ర్జీ.వీ వరల్డ్ థియేటర్ లో విడుదల చేసిన వర్మ నుండి వస్తోన్న మరో చిత్రం కరోనా వైరస్. మనల్ని వణికించిన ఈ వైరస్ ను కథావస్తువుగా తీసుకుని అగస్త్య మంజు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా వర్మ నిర్మించాడు. డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. అంతే కాకుండా తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి. అలాగే ఆ.ర్జీ.వీ వరల్డ్ థియేటర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, శాంసంగ్ స్మార్ట్ టివి, అమెజాన్ ఫైర్ స్టిక్ పై కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.