2020 సంవత్సరంలో వచ్చిన భీష్మ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ ఇప్పుడు ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా చెక్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి గ్లిమ్స్ విడుదల తేదిని మూవీ టీం న్యూ ఇయర్ సందర్భంగా కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేసింది. ఈ పోస్టర్ లో నితిన్ ఖైదీ డ్రెస్ లో కనిపించారు. ఇక జనవరి 3 ఉదయం 10 గంటలకి ఈ మూవీ గ్లిమ్స్ విడుదల చేయబోతున్నారు అని మూవీ టీం ప్రకటించారు. ఇక తెలుగులో ప్రియ ప్రకాష్ కి ఇదే మొదటి సినిమా అవ్వడం విశేషం. అలాగే చెక్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక లాయర్ క్యారెక్టర్ ని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ కి మంచి స్పందన వచ్చింది. విభిన్న సినిమాలని తెరకెక్కించే దర్శకుడు చంద్ర శేఖర్ యేలేటి ఈ సినిమాలో నితిన్ ఎలా చూపించబోతున్నారో అని అందరూ ఎదురుచూస్తున్నారు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ చూసి చెప్పొచ్చు. ఇక చెక్ సినిమాతో పాటు నితిన్ రంగ్ దే సినిమాని కూడా విడుదలకు సిద్ధం చేస్తున్నారు