A tale of twisted love with technology finds itself at the center of a revenge saga 🤯 #BombhaatOnPrime, December 3!@SaiSushanthRedd @iChandiniC @SimranCOfficial @Bujji_7799 @Josyabhatla @SuchetaDream pic.twitter.com/DTPZSrrZxd
— amazon prime video IN (@PrimeVideoIN) November 27, 2020
ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కు మంచి గిరాకీ ఉంది. సినిమాలను ఓ.టి.టిలో విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఓ.టి.టి సంస్థలు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, సిరీస్ లను తమ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలనుకుంటున్నాయి. రీసెంట్ గా తెలుగులో ఆహాలో విడుదలైన కలర్ ఫోటో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో నటించిన చాందిని చౌదరికి హీరోయిన్ గా చాలా పేరు వచ్చింది. ఇక ఈ నగరానికి ఏమైంది ఫేమ్ సుశాంత్, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ‘బొంభాట్’. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఈ చిత్ర హక్కులను దక్కించుకుంది. రాఘవేంద్ర వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వెటరన్ దర్శకులు రాఘవేంద్ర రావు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇదొక సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదల చేసారు. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ఎప్పుడూ బ్యాడ్ లక్ తో బాధపడే విక్కీ చైత్రను లవ్ చేస్తాడు. మధ్యలో మాయ అనే హ్యూమనోయిడ్ రోబో వచ్చి కథను ఎలాంటి కీలక మలుపు తిప్పింది అనేది ఈ చిత్ర మెయిన్ పాయింట్.