
అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భాగమతి. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పిల్ల జమిందార్ ఫేమ్ అశోక్ ఈ సినిమాకు దర్శకుడు. భాగమతి చిత్రాన్ని బాలీవుడ్ లో దుర్గామతి పేరుతో రూపొందించిన సంగతి తెల్సిందే. బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ ఈ సినిమాలో అనుష్క పాత్రలో కనిపించనుంది. మొదటి సారి హారర్ నేపధ్యమున్న చిత్రంలో, అందులోనూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో కనిపించనుంది భూమి. అక్షయ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అశోక్ ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఇప్పుడు విడుదల చేసారు. డిసెంబర్ 11న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. మరి టాలీవుడ్ లో విజయం సాధించిన ఈ చిత్రం హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఇటీవలే అక్షయ్ కుమార్ తెలుగు సినిమా కాంచన రీమేక్ లక్ష్మిలో నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఇటీవలే హాట్ స్టార్ లో విడుదల కాగా దానికి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే వ్యూస్ పరంగా మాత్రం రికార్డు సృష్టించింది ఈ చిత్రం.
It's payback time! Get ready to meet #DurgamatiOnPrime on Dec 11, @PrimeVideoIN.
— Akshay Kumar (@akshaykumar) November 24, 2020
Trailer out tomorrow!@bhumipednekar @ashokdirector2 #CapeOfGoodFilms #BhushanKumar #KrishanKumar @vikramix @Abundantia_Ent @TSeries @ArshadWarsi @Jisshusengupta @MahieGillOnline @KapadiaKaran pic.twitter.com/7GSUzEwPL4