
హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి విచిత్రమైన టైటిల్స్ లో విభిన్నమైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఎవడబ్బసోత్తు కాదు అని ప్రూవ్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న చిత్రం బజారురౌడి. ఈ సినిమా మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు సీనియర్ నటుడు నాగినీడు, షియాజి షిండే, పృథ్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ...చాలా రోజుల తరువాత నేను ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇలా మాట్లాడ్డం సంతోషం. నాలుగు సినిమాల్లో నటించాను, ఇది నా ఐదో సినిమా. నా ప్రతి సినిమాను ఆదరించిన ప్రేక్షకులు ఈ సినిమాను కూడా సక్సెస్ చేస్తారని ఆసుస్తున్నాను. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వి, షియాజి షిండే, నాగినీడు, కరాటే కల్యాణి మాట్లాడుతూ... బజారురౌడీ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా సంపూర్ణేష్ బాబుకు మరో మంచి సినిమా అవుతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది తెలిపారు.