
రానా దగ్గుబాటి ప్రధానపాత్రను పోషించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సోల్మన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఇరోస్ ఇంటర్నేషనల్ నిర్మించింది. ఈ చిత్రం తమిళంలో కాడన్ పేరుతో, హిందీలో హాథి మేరి సాథి పేరుతోనూ నిర్మించబడింది. విష్ణు విశాల్, పుల్కిత్ సామ్రాట్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావున్కర్, సంపత్ రామ్, రవి కాలే తదితరులు నటించారు. ఈ చిత్రం మార్చ్ 26న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మూడు భాషల్లో విడుదల అయ్యింది.

ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ పెరిగింది. భారి బడ్జెట్ సినిమాలు ఎక్కువగా నిర్మితమవుతున్నాయి. దాంతో పాటు ఒకే భాషలో కాకుండా మరో రెండు, మూడు భాషల్లో నిర్మిస్తే అక్కడ కూడా మార్కెట్ జరిగి ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా పెట్టిన డబ్బులు తిరిగి వచ్చే చాన్స్ ఉంటుంది.

స్వార్ధంతో మనిషి చేస్తున్న అరాచాకాలు ఎక్కువైపోయాయి. మనం పండించే దాంట్లో 20 శాతం ప్రకృతికే చెందుతుంది. అడవులు, చెట్లు ఇలా అన్నిటినీ నాశనం చేసి తన కోసం వాటిని వాడుకుంటున్నాడు. పులులు, సింహాల చర్మాల కోసం వాటిని వేటాడి చంపడం, ఏనుగుల దంతాల కోసం వాటిని చంపడం, అడవుల్లో ఉండే విలువైన చెట్లను స్మగ్లింగ్ చేయడం లాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

ఒక మినిస్టర్ అడివిలో ఏనుగులు ఉండే ప్రాంతాన్ని ఆక్రమించుకుని దాంట్లో టౌన్ షిప్ కట్టాలని అనుకుంటాడు. అవి రాకుండా చుట్టూ గోడ కట్టిస్తాడు. వాటికి నీళ్ళు దొరికే చోటు అదొక్కటే కావడం వల్ల దానికి అరణ్య అడ్డుపడతాడు. అతను ఎలా వాళ్ళను ఎదుర్కున్నాడు అతనికి వచ్చిన సమస్యలు ఏంటి అనేది కథ. సీన్స్ అన్ని చాలా న్యాచురల్ గా ఉన్నాయి. రానా నటన బాగుంది. కొన్ని లాజిక్స్ ని పక్కన పెడితే సినిమాని ఎంజాయ్ చేయొచ్చు.