
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు వచ్చిన సింహ, లెజెండ్ ఘనవిజయాలు సాధించి అప్పటి వరకూ ఉన్న రికార్డ్లనూ తిరగారాసాయి. ఇక వారి నుండి వస్తున్న మూడవ చిత్రం కోసం అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. పోయినేడాది వచ్చిన ఫస్ట్ గ్లిమ్ప్స్ తో ఈ చిత్రంపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అప్పటి నుండి టీజర్ కోసం అభిమానుల ఎదురుచూపులు మామూలుగా లేవు.
ఇక రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది..కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా ఇదే డైలాగ్ వినిపిస్తుంది. ఉగాది సందర్భంగా ఏప్రిల్13న మ్యాసీవ్ టైటిల్ రోర్ పేరుతో ‘అఖండ’ టీజర్ విడుదలై యూట్యూబ్‌లో అపూర్వ ఆదరణతో దూసుకెళ్తూ కేవలం 16రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్‌ని సాధించి టాలీవుడ్లో ఫాస్టెస్ట్ 50 మిలియన్స్ వ్యూస్ సాధించిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ ఇంతటి అఖండ విజయానికి కారణమైన అభిమానులకు, ఆదరించిన ప్రతి ఒక్కరికి అఖండ యూనిట్ అభినందనలు తెలుపుతోంది.

నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్‌తో పాటు భారీతారాగణం నటిస్తున్న ఈ చిత్రాన్ని మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారక క్రియేషన్స్ పతాకంపై యంగ్ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సి. రాంప్రసాద్, సంగీతం: తమన్ ఎస్, మాటలు: ఎం.రత్నం, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు, తమ్మిరాజు, ఫైట్స్: స్టన్ శివ, రామ్-లక్ష్మణ్, సమర్పణ: మిర్యాల సత్యనారాయణ రెడ్డి, నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకత్వం: బోయపాటి శ్రీను.