
ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తో సలార్ ను మొదలుపెట్టి ఆ సినిమా సెట్స్ పై ఉండగానే ఆదిపురుష్ కూడా మొదలు పెట్టేసాడు. ఇవి రెండు భారి బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలు. రెండు సినిమాలని రెండు చేతులతో బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. అయితే జనవరిలోనే సినిమా షూటింగ్ మొదలైంది అనుకోకుండా సెట్ కాలిపోవడంతో షూటింగ్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు.

ఈ చిత్రానికి సంబంధించిన ముఖ్యపాత్రాల్లో నటించే నటీనటులు దాదాపు ఫైనల్ అయ్యారు. సీతదేవిగా పలువురి పేర్లు వినిపించాయి ఆఖరికి కృతి సనన్ ఎంపికవగా రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ ఎంపికయ్యారు ఇతర ముఖ్యపాత్రల్లో నటించేవారు కూడా ఎంపికైనా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని సమాచారం. బాహుబలి చిత్రంతో వచ్చిన క్రేజ్ ని నిలబెట్టుకోవాలి అంటే ఆయన భారి సినిమాలు చేయక తప్పదు.

అయితే ఈ చిత్ర ఆర్ట్ డిపార్ట్మెంట్ ముంబైలోని మధ ద్వీపంలో ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ లో నడిచే సీన్స్ కి సంబంధించిన సెట్స్ వేశారు. ఇక్కడ మొదటి షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు. ఇందులో రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు మొదలగు ముఖ్యపాత్రలతో కూడిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. కేవలం డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ మరియు ఆ సన్నివేశాల్లో నటించే నటీనటులు అందరూ కలిపి కేవలం 25 మంది మాత్రమే ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. ఈ మధ్య కరోన మళ్ళీ చెలరేగటంతో ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. వీలైంత తొందరగా షూటింగ్ పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.