టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్స్ లిస్ట్!!

టాలీవుడ్ లో పెళ్లి కాకుండా ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లిస్ట్ ఒకసారి చూద్దాం.

1. ప్రభాస్: రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ఈ లిస్ట్ లో చాలా సంవత్సరాల నుండీ ఉంటూ వస్తోంది. పెళ్ళెప్పుడు అంటే ఈ సినిమా రిలీజ్ తర్వాత, ఆ సినిమా రిలీజ్ తర్వాత అంటూ పోస్ట్ పోన్ చేస్తోన్న ప్రభాస్ ప్రస్తుతం నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీ. ప్రస్తుతం ప్రభాస్ కు 41 సంవత్సరాలు.

2. శర్వానంద్: యంగ్ హీరో శర్వానంద్ కూడా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటాడు. బాయ్ నెక్స్ట్ డోర్ లుక్స్ తో ఇంప్రెస్ చేసే శర్వానంద్ కు ప్రస్తుతం 36 సంవత్సరాలు. తను నటించిన శ్రీకారం రిలీజ్ కు సిద్ధమవ్వగా మరో రెండు సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉన్నాడు.

3. విజయ్ దేవరకొండ: లేటెస్ట్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కూడా ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు. ఈ హీరోకు ప్రస్తుతం 31 సంవత్సరాలు. వరసగా క్రేజీ సినిమాలతో నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్.

4. రామ్: రెడ్ తో మనల్ని పలకరించిన రామ్ కు కూడా ఇంకా పెళ్లి అవ్వలేదు. ఆయన వయసు 32 సంవత్సరాలు.

ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నాగ శౌర్య, సందీప్ కిషన్, అడివి శేష్, రాజ్ తరుణ్ వంటి హీరోలతో ఈ లిస్ట్ పెద్దగానే ఉంది.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.