


మల్టీ స్టారర్ సినిమాలకి ఉండే క్రేజే వేరు. అప్పటి ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ల తరం నుండి ఇప్పటి ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ ల వరకూ ఆ క్రేజ్ అలానే ఉంది. ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ ల కంబో అయితే ఈ డికేడ్ లోనే అతి పెద్ద కాంబో. ఒకే ఏజ్ గ్రూప్ కి సంబంధించిన హీరోలు ఒకే సినిమాలో నటించి చాలా కాలమే అయ్యింది. పైగా ఈ సినిమా ప్యాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతోంది. అలాగే ఇప్పుడిప్పుడే మల్టీ స్టారర్స్ ఎక్కువ అవుతున్నాయి.

ఈ ట్రెండ్ ని మరింత బలోపేతం చేస్తూ అనిల్ రవిపూడి చేసిన ప్రయత్నమే వెంకటేష్, వరుణ్ తేజ్ లు కథానాయకులుగా ‘f-2’. ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో పాటు జాతీయ అవార్డు కూడా కైవసం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న f-3 షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు మరో హీరో కూడా నటించనున్నాడు.

ఆ హీరో ఎవరనే దాని మీద కూడా ఎన్నో రూమర్స్ వచ్చాయి. మహేష్ బాబు అని కొందరంటే రామ్ అని కొందరు అన్నారు. అయితే ఈ విషయం మీద దర్శకుడు అనిల్ కాని, హీరోలు కాని ఎవరూ స్పందించలేదు. ఇదిలా ఉండగా మరో వార్త ఇప్పుడు హల చల్ చేస్తోంది. అనిల్ తదుపరి ప్రాజెక్ట్ కూడా మల్టీస్టారరే అని.

ఈసారి ఆయన ముగ్గురు హీరోలతో డైరెక్ట్ గా సినిమా చేయనున్నారు అని. వారే మహేష్ బాబు, బాలకృష్ణ, రామ్ పోతినేని. ఈ ముగ్గురిలో ఎవరూ ఈ విషయమై స్పందించలేదు. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, బాలకృష్ణ బి.బి.3, రామ్ లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి ఈ విషయం గురించి ఎవరైనా స్పందిస్తే తప్ప క్లారిటీ రాదు. ఒక వేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఫ్యాన్స్ ఇక పండగే.