ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చేశాడు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుష్.!!

యంగ్ టైగర్  ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ మరో కథానాయకుడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా  13 అక్టోబర్ లో ఈ సినిమా ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి..ప్యాన్ ఇండియాా వైడ్ గా వస్తున్న ఈ సినిమా రెండు కాలాలకు చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల కథ అని చెప్తున్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్నారు.. ఇప్పటికే ఈ ఇద్దరి హీరోల లుక్స్ ని, టీజర్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు జక్కన్న. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతున్నాడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘టెంపర్'తో మొదలైన అతడి విజయ పరంపర ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్', ‘జై లవ కుశ', ‘అరవింద సమేత.. వీరరాఘవ' వరకూ కంటిన్యూ అయింది. ఇలా ప్రస్తుత తరంలో ఏ స్టార్ హీరోనూ వరుసగా ఐదు విజయాలను నమోదు చేయలేదు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో సినిమా చేసే పనిలో ఉన్నాడు. త్రివిక్రమ్ తో అరవింద సమేత సినిమా ను చేసిన ఎన్టీఆర్ రెండో సినిమా అయన తో వెంటనే చేయడం విశేషం.

ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఈ రెండు ఇంకా లైన్ లో ఉండగానే మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమాను ఒప్పుకున్నారని టాక్ వచ్చింది. ఎన్టీఆర్ మాస్ క్యాలిబర్ కు తగ్గ కథను నీల్ సిద్ధం చేసాడని తెలిసింది. దీనితో ఈ కాంబోపై ఒక్కసారిగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ అనూహ్యంగా అది కాస్త దూరం అయ్యి అసలు ఉందా లేదా అన్న సంశయం మొదలయ్యింది. అయితే ఇప్పుడు ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్ లో ఈ మాస్ కాంబోపై క్లారిటీ ఇచ్చారు. దాదాపు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే ఉంటుంది అని దాన్ని రైట్ టైం లో అనౌన్స్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. సో ఈ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఉండటం కన్ఫర్మ్ అని చెప్పాలి.

- Advertisement -

You've successfully subscribed to Tollywood Latest News | Celebrities Profiles | Media9 Tollywood
Great! Next, complete checkout to get full access to all premium content.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.