
సినిమా కరోనా భారిన పడి సంవత్సరం కావొస్తోంది. మూడు నెలల లక్దౌన్, ఆ తర్వాత 6 నెలలకు పైగా విరామం, వీటిని దాటుకుని ఇప్పుడిప్పుడే సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుంటున్నాయి. ‘బాహుబలి’ చిత్రం తర్వాత దక్షిణాది చిత్రాలకు క్రేజ్ పెరిగిపోయింది. ఆ క్రేజ్ ను క్యారీ చేస్తూ కే.జి.ఎఫ్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇప్పుడు అందరి చూపు దక్షిణాది చిత్రాల పై ఉండడం గమనార్హం. ప్యాన్ ఇండియన్ చిత్రాలుగా తెరకెక్కుతున్న చిత్రాలు తమ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసాయి. ఆర్.ఆర్.ఆర్ ఆక్టోబర్ 13న, కే.జి.ఎఫ్-2 జూలై 16న, పుష్ప ఆగస్ట్ 13న, ఆచార్య మే 13న, బి.బి.3 మే 28న, వకీల్ సాబ్ ఏప్రిల్ 9న, విడుదలవనున్నాయి. వీటిలో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాలు తప్ప మిగితావి ప్యాన్ ఇండియన్ చిత్రాలు. ‘రాధే శ్యామ్’ కూడా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా అప్డేట్ 14న తెలుస్తుంది. ఇలా ఒకే సంవత్సరం పెద్ద హీరోల సినిమాలు విడుదలై చాల కాలం అయ్యింది. పెద్ద చిత్రాలు విడుదలైతే థియేటర్ ని నమ్ముకుని ఆధారపడిన జనాలకు కొంత ఊరటగా ఉంటుంది. అలాగే పెద్ద సినిమాలు హిట్ అయితే మంచి రెవెన్యూ పెరిగి పరిశ్రమకి కూడా మేలు జరుగుతుంది. ఇక విడుదలయ్యే అన్ని చిత్రాలు హిట్ అవ్వాలని కోరుకుందాం.