Most awaited & Most anticipated #Pushpa Shoot commences from Nov 10th 😎@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @PushpaMovie
— Mythri Movie Makers (@MythriOfficial) November 9, 2020
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा pic.twitter.com/VyKHUixFOH
‘రంగస్థలం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలసి ‘పుష్ప’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నవీన్ ఎర్నేని, రవి శంకర్. వై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ముత్తంశెట్టి మీడియాతో కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మండన్న కథానాయికగా నటిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అభిమానులలో మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రం ఎర్ర చందనం స్మగ్లింగ్మ్ నేపథ్యంలో, చిత్తూరు లొకాలిటీలో జరుగుతుంది. అందుకని అల్లు అర్జున్, రష్మిక చిత్తూరు యాసలో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. కేరళలోని దట్టమైన అడువుల్లో షూటింగ్ స్టార్ట్ అయింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రభుత్వం షూటింగ్ కి అనుమతులు ఇచ్చిన తర్వాత షెడ్యూల్ కొనసాగించడానికి చాలా అడవి ప్రాంతాలని పరశీలించారు. చివరికి ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి డీప్ ఫారెస్ట్ ని ఫిక్స్ చేశారు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత చిత్రబృందం మొత్తం షూటింగ్ కి రెడీ అయ్యింది. యూనిట్ మొత్తం కొన్ని రోజుల క్రితం మారేడుమిల్లి చేరుకుంది. షెడ్యూల్ స్టార్ట్ అయిందని మైత్రీ మూవీ మేకర్స్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక బిహైండ్ ది సీన్స్ వీడియోని రిలీజ్ చేసింది. ఆర్య, ఆర్య-2 సినిమాల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో అభిమానులు, సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కెమెరా: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్.