
మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత చేయబోయే సినిమాలను కూడా ఆయన లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. కుర్ర హీరోలతో పోటి పడుతూ సినిమాలు చేస్తున్నారు. 65 ఏళ్ల వయసులో కూడా యువకుడిలా పని చేసుకుంటూ అభిమానుల్ని అలరిస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటారు. ఎలాంటి విషయమైనా సరే ఆయన తన అభిమానులతో పంచుకుంటారు.

ఆచార్య అయిపోయిన వెంటనే మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ ను స్టార్ట్ చేయనున్నారు. దాంతో పాటే వేదాళం రీమేక్ ను కూడా ఒకేసారి తెరకెక్కించే ఆలోచలనలో ఉన్నారు. దానికోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాలు అయిపోయిన వెంటనే బాబి దర్శకత్వంలో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా ఎంపికయిన ఎన్.వి రమణ గారికి శుభాకాంక్షలు తెలియచేసారు.
Hearty Congrats to #TeluguPride Sri.#NVRamana garu as he takes oath as Hon'ble Chief Justice of India today Eminent jurist for 40 yrs,reaches pinnacle of his illustrious career.Only 2nd Telugu to earn the glory after 55 long yrs.His motherland is joyous on the momentous occasion pic.twitter.com/EqE8r1m82W
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 24, 2021
“సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గా పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న తెలుగు తేజం ఎన్.వి రమణ గారికి శుభాభినందనలు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి, విద్యార్ధి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ, సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు, గత 40ఏళ్లుగా న్యాయక్షేత్రంలో నిత్యకృషీవలుడు శ్రీ రమణ గారు. అత్యున్నత న్యాయస్థానంలో అత్యన్నత పదవి 55 సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డని చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతుంది.” అని ట్వీట్ చేసారు.