
టాలివుడ్ లో ఒకప్పుడు పెద్ద దిక్కుగా ఉండే దాసరి గారి మరణం తర్వాత ఆ స్థానం ఖాళీగానే ఉంటోంది. ఎవరికీ ఏ అవసరం ఉన్నా ఆయన చూసుకునే వారు. ముఖ్యంగా చిన్న సినిమాలను ఆయన ఎక్కువగా ప్రోత్సాహించే వారు. ఆయన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు బర్తీ చేస్తారు అన్న ప్రశ్నకు సమాధానంగా నిలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. దాసరిగారి లానే సినిమా ఫంక్షన్లకి వెళ్తూ వారి ప్రమోషన్స్ లో భాగం అవుతున్నారు. పెద్ద సినిమాలు మొదలుకుని చిన్న సినిమాల వరకూ అన్నిటినీ ప్రోత్సహిస్తున్నారు.

అలాగే ఎవరికీ ఏ ఆపద వచ్చిన నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు. ఇదివరకు ఇండస్ట్రీ కి సంబంధించిన విషయాలు దాసరి గారు చూసుకునే వారు. ఇప్పుడు ఆ విషయాలు దాదాపు చిరంజీవి గారే చూసుకుంటున్నారు. సీటింగ్ కెపాసిటి విషయమై థియేటర్ యజమానుల తరపున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఆయనే ఆ విషయాన్ని ఓ కొలిక్కి తీసుకువచ్చారు. లాక్ డౌన్ లో ఉన్నప్పుడు కూడా షూటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటూ ప్రభుత్వాలని కోరిన విషయం తెలిసిందే.
తెలుగు చిత్ర పరిశ్రమలోని సినీ కార్మికులని,సినీ జర్నలిస్టులని కరోనా బారి నుంచి రక్షించుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ #CCC తరుపున ఉచితంగా అందరికి వాక్సినేషన్ వేయించే సదుపాయం అపోలో 247 సౌజన్యంతో చేపడుతున్నాం. Lets ensure safety of everyone.#GetVaccinated#WearMask #StaySafe pic.twitter.com/NpIhuYWlLd
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
కరోన విలయ తాండవం చేస్తున్న వేళ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి రావచ్చు రాకపోవచ్చు అందుచేత అపోలో వారి సహాయంతో ఇండస్ట్రీలో 45 ఏళ్ళు దాటినా సినీ కార్మికులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నారు. సినీ జర్నలిస్ట్లు కూడా ఈ సహాయాన్ని అందుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకునే వారి భాగస్వాములకు కూడా 45 ఏళ్ళు దాటితే ఉచితంగా అందించనున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి 3 నెలల వరకూ అపోలో డాక్టర్ లను ఉచితంగా కలిసేందుకు వెసులుబాటును కల్పిస్తున్నారు. అలాగే వారికి మందులు కూడా రాయితీతో అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దీంతో ఇప్పుడు అందరూ దాసరి గారి తర్వత ఆయన స్థానాన్ని ఆయనే బర్తీ చేయాలని అంటున్నారు.